Rama raju:అబ్బే నేను ఓటు అడగలేదు.. రాపాక కామెంట్లపై రామరాజు క్లారిటీ
Rama raju:ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం టీడీపీ తనతో బేరసారాలకు దిగిందని ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ (Rapaka vara prasad) సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడితో ఉండి ఎమ్మెల్యే రామరాజు (Rama raju) సంప్రదింపులు జరిపారని తెలిపారు. ఇదే అంశంపై రామరాజు (Rama raju) స్పందిస్తూ.. రాజకీయాల్లో అందరం స్నేహాంగా ఉంటామని చెప్పారు.
Rama raju:ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం టీడీపీ తనతో బేరసారాలకు దిగిందని ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ (Rapaka vara prasad) సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడితో ఉండి ఎమ్మెల్యే రామరాజు (Rama raju) సంప్రదింపులు జరిపారని తెలిపారు. ఇదే అంశంపై రామరాజు (Rama raju) స్పందిస్తూ.. రాజకీయాల్లో అందరం స్నేహాంగా ఉంటామని చుప్పారు. రాపాక వరప్రసాద్‌తో తాను మాట్లాడతానని..ఓటు మాత్రం అడగలేదని ఆయన స్పష్టంచేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి తమ పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. సొంత పార్టీకి చెందిన కొందరు ఓటు వేయకపోయినా.. వైసీపీలో అసంతృప్తితో ఉన్నవారు ఓటు వేస్తారనే ఆత్మవిశ్వాసంతో ఉన్నామని తెలిపారు. రాపాక తన పేరు ఎందుకు చెప్పారో తెలియడం లేదన్నారు. తాను రాపాకతో సంప్రదింపులు జరపలేదని రామరాజు (Rama raju) తేల్చిచెప్పారు.
అంతకుముందు ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka vara prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతోనే బేరసారాలు ప్రారంభం అయ్యాయని చెప్పారు. తెలుగుదేశం అభ్యర్థి ఓటు వేయాలని.. టీడీపీ నేతలు తన మిత్రుడిని సంప్రదించారని వివరించారు. అలా వేస్తే రూ.10 కోట్లు (10 crores) ఇచ్చే వారని పేర్కొన్నారు. రాజోలులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. మిత్రుడు కేఎస్ఎన్ రాజుతో (ksn raju) టీడీపీ నేతలు బేరం ఆడారని వివరించారు. అసెంబ్లీ వద్ద కూడా ఒక రాజు అని.. (రామ రాజు) తనతో బేరాలకు దిగారని హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీకి ఓటేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారని తెలిపారు. కానీ అందుకు అంగీకరించలేదని చెప్పారు. ఒకసారి పరువు పోతే సమాజంలో తలెత్తుకుని తిరగలేమని చెప్పారు. సిగ్గు, శరం వదిలేసి ఉంటే రూ.10 కోట్లు (10 crores) వచ్చేవని తెలిపారు. తాను సీఎం జగన్‌ను (jagan) విశ్వసించానని స్పష్టంచేశారు. టీడీపీ ఆఫర్ తిరస్కరించానని ఆయన వెల్లడించారు. ఆ వెంటనే రామరాజు రియాక్షన్ ఇచ్చారు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ (anuradha) విజయం సాధించారు. అనురాధకు ఆనం రాంనారాయణ రెడ్డి (anam ram narayana reddy), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (kotamreddy sridhar reddy), ఉండవల్లి శ్రీదేవి (sirdevi), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (chandra shekar reddy) ఓటు వేశారట.. వారిని సస్పెండ్ చేశామని వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) ప్రకటించారు.