రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సీజన్ స్టార్టింగ్‌లో గట్టి దెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ రజత్ పటిదార్ సీజన్ నుంచి దూరం అయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ మేనెజ్ మెంట్ కూడా కన్ఫామ్ చేసింది.
Rajat patidar:రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సీజన్ స్టార్టింగ్‌లో గట్టి దెబ్బ తగిలింది. ఫస్ట్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై (mI) ఈజీగా గెలిచినప్పటికీ.. స్టార్ బ్యాటర్ రజత్ పటిదార్ (Rajat patidar) సీజన్ నుంచి దూరం అయ్యాడు. గాయం వల్ల అతను ఈ సీజన్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఈ విషయాన్ని ఆర్సీబీ (RCB) మేనెజ్ మెంట్ కూడా కన్ఫామ్ చేసింది.
ఫస్ట్ మ్యాచ్‌లో రజత్ (rajath) ప్లేస్‌లో దినేశ్ కార్తీక్ (dinesh karthik) బరిలోకి దిగాడు. మూడు బంతులు ఆడి పెవిలియన్ చేరాడు. దీంతో రజత్ ప్లేస్ ఏంటో మేనెజ్ మెంట్‌కు తెలిసింది. పటిదార్ లేకపోవడం ఆర్సీబీ టాప్ ఆర్డర్‌కు దెబ్బేనని క్రీడా పండితులు చెబుతున్నారు. అతని ప్లేస్ భర్తి చేసేందుకు అనూజ్ రావత్, సుయాష్ ప్రభుదేశాయ్ ఉన్నారు. వీరిలో ఒకరిని తీసుకోవాల్సి ఉంటుంది.
గత సీజన్లో రజత్ (Rajat patidar) ఉత్తమ ప్రతిభ చూపాడు. అప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. 8 మ్యాచ్‌లు ఆడి.. 333 రన్స్ చేశాడు. ప్లే ఆప్‌లో సెంచరీతో అలరించాడు. దేశవాళిలో మధ్యప్రదేశ్ తరఫున ఆడుతూ.. చక్కని ఫామ్‌లో ఉన్నాడు. గాయం వల్ల సీజన్ నుంచి దూరం అయ్యాడు.