»Sachin Statue Will Be Unveiled At Wankhede Stadium Today
Sachin Tendulkar: నేడు వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహాష్కరణ
వాంఖడే స్టేడియంలో నేడు సచిన్ టెండూల్కర్ విగ్రహావిష్కరణ జరగనుంది. వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా గురువారం భారత్, శ్రీలంక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఒక రోజు ముందుగానే సచిన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కార్యక్రమానికి బీసీసీఐ సభ్యులతో పాటుగా సచిన్ కూడా హాజరుకానున్నారు.
అందరూ క్రికెట్ డేవుడి (Cricket God)గా భావించే సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మకమైన వాంఖడే స్టేడియం (Wankhede Stadium)లో క్రికెట్ దిగ్గజం సచిన్ విగ్రహాన్ని (Sachin Statue) ఆవిష్కరించనున్నారు. బుధవారం జరిగే ఈ విగ్రహావిష్కరణకు ప్రముఖులంతా విచ్చేయనున్నారు. స్టేడియంలో సచిన్ స్టాండ్ పక్కనే దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఆఫ్‌సైడ్‌లో సచిన్ షాట్ ఆడుతున్న చిత్రాన్ని విగ్రహం కోసం ఎంపిక చేసుకున్నారు.
అహ్మదాబాద్‌కు చెందిన ప్రమోద్ కాంబ్లే ఈ సచిన్ విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహావిష్కరణకు సచిన్‌తో పాటుగా మహారాష్ట్ర (Maharastra) సీఎం ఏక్నాథ్ షిండే, బీసీసీఐ కార్యదర్శి జైషా తదితరులు హాజరుకానున్నారు. ముంబై వాంఖడే స్టేడియంతో సచిన్‌కు విడదీయలేని అనుబంధం ఉంది. 2011 వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ (World Cup Trophy)ని సచిన్ ఈ స్టేడియంలోనే అందుకున్నాడు. అలాగే తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ (Last International match)ను కూడా ఈ మైదానంలోనే 2013 నవంబర్ 16న ఆడటం విశేషం.
వాంఖడే స్టేడియాన్ని (Wankhede Stadium) సచిన్ హోంగ్రౌండ్‌గా భావిస్తాడు. అందుకే సచిన్‌కు ఈ స్టేడియం ఎంతో సెంటిమెంట్. నేడు జరిగే విగ్రహావిష్కరణకు బీసీసీఐ కార్యదర్శి జైషా, బీసీసీఐ కోశాధికారి ఆశిష్ షెలార్, ముంబై క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అమోల్ కాలే, అజింక్యా నాయక్ హాజరు కానున్నారు. నిజానికి సచిన్ టెండూల్కర్ 50వ జన్మదినం సందర్భంగా ఆ విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనుకున్నారు. అయితే అప్పటికే ఆ విగ్రహం పూర్తి కాకపోవడంతో ఇప్పుడు ఆవిష్కరిస్తున్నారు. గురువారం వాంఖడే స్టేడియంలో భారత్, శ్రీలంక మ్యాచ్ జరగనుంది. ఈ తరుణంలో ఒక రోజు ముందుగా సచిన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.