స్టార్ ఫుట్‌బాలర్ అయిన క్రిస్టియానో రొనాల్డో సౌదీ అరేబియా తరపున తొలిగోల్ కొట్టాడు. సౌదీ అరేబియా క్లబ్‌కు చెందిన ఆల్ నస్రీ క్లబ్ రొనాల్డోను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆల్ నస్రీ క్లబ్ ఈమధ్యే రూ.4400 వేల కోట్ల భారీ ధరకు రొనాల్డోతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఫిఫా వరల్డ్ కప్ సమయంలో మాంచెస్టర్ యూనైటెడ్ క్లబ్ అతడితో కాంట్రాక్టును రద్దు చేసుకోగా ఆ సమయంలో రొనాల్డోతో ఒప్పందం చేసుకునేందుకు చాలా క్లబ్స్ పోటీ పడ్డాయి. అయితే అందరికంటే ఎక్కువగా సౌదీ అరేబియా క్లబ్ అయిన ఆల్ నస్రీ భారీ ధర ఆఫర్ చేసింది.
د90+3' هدف التعادل لـ النصر عن طريق كريستيانو رونالدو
దీంతో రెండున్నరేళ్ల పాటు రొనాల్డో ఆ క్లబ్‌తో కొనసాగనున్నాడు. రొనాల్డో జనవరి 22వ తేదిన ఆల్ నస్రీ తరపున తొలి మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఎత్తిఫక్ జట్టుపై 1-0తో ఆల్ నస్రీ విజయం సాధించింది. మామూలుగా అయితే గోల్ కొట్టిన తర్వాత రొనాల్డో తన సిగ్నేచర్ స్టైల్లో సెల్రబేట్ చేసుకునేవాడు అయితే ఈసారి మాత్రం గోల్ పోస్టులోకి వెళ్లి బంతి అందుకుని కొంత దూరం పరుగెత్తాడు. రొనాల్డో గోల్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.