టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్ ప్రాక్టీస్ చేస్తోండగా గాయపడ్డారు. ఇంగ్లాండ్‌తో కీలకమైన లీగ్ మ్యాచ్ ముందు రోహిత్‌కు గాయమైంది. దీంతో అతను ఆడతాడా లేదా అనే సందిగ్ధత మాత్రం కొనసాగుతోంది.
Rohit Sharma: వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇంగ్లాండ్‌తో ఈ రోజు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే డైరెక్ట్ సెమీ ఫైనల్ చేరుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆడటం కాస్త అనుమానంగా ఉంది. నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ శర్మ (Rohit Sharma) గాయపడ్డారు. గాయం చిన్నదే అయినప్పటికీ ఆడటంపై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ రోహిత్ ఆడకుంటే జట్టును కేఎల్ రాహుల్ ముందుకు నడిపిస్తాడు.
రోహిత్ శర్మ (Rohit Sharma) కుడిచేయి మణికట్టుకు బంతి బలంగా తాకింది. ఈ విషయాన్ని ఇన్ సైడర్ స్పోర్ట్ పేర్కొంది. ఫిజియో వెంటనే చికిత్స చేశారని తెలిపింది. గాయం తీవ్రత గురించి మాత్రం సమాచారం లేదు. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ రోజు జరిగే మ్యాచ్ రోహిత్ శర్మకు (Rohit Sharma) మైలురాయిగా మారనుంది. రోహిత్ మ్యాచ్ ఆడితే టీమిండియా కెప్టెన్‌గా 100వ మ్యాచ్ అవుతుంది.
అంతర్జాతీయ క్రికెట్లో 18 వేల పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరడానికి రోహిత్ శర్మ (Rohit Sharma) కేవలం 47 పరుగుల దూరంలో ఉన్నాడు. రోహిత్ ఫామ్‌లో ఉండటంతో.. ఆ పరుగులు చేయడం పెద్ద సమస్యేం కాదు. దీంతో దిగ్గజాల సరసన రోహిత్ శర్మ చేరతాడు. వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ 62.20 సగటుతో 311 పరుగులు చేశాడు.