England's players celebrate after the dismissal of New Zealand's Martin Guptill (not pictured) during the ICC mens Twenty20 World Cup semi-final match between England and New Zealand at the Sheikh Zayed Cricket Stadium in Abu Dhabi on November 10, 2021. (Photo by Aamir QURESHI / AFP) (Photo by AAMIR QURESHI/AFP via Getty Images)
టీ20 వరల్డ్ కప్ సమరం ముగిసింది. ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. పాకిస్తాన్ తో జరిగిన ఫనల్స్ లో విజయం సాధించి… టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. తొలిత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు కేవలం 137 పరుగులు చేయగా, ఇంగ్లండ్ జట్టు అతికష్టం మీద లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ బౌలర్ల ధాటికి ఆపసోపాలు పడింది. 5 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు బెన్‌స్టోక్స్, మోయిన్ ఆలీలు జట్టును విజయతీరాలకు చేర్చారు.
138 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ జట్టుకు పాక్ బౌలర్ షహీన్ షా అఫ్రిదీ మొదటి ఓవర్లోనే షాక్ ఇచ్చాడు. సెమీ ఫైనల్ హీరో అలెక్స్ హేల్‌ను ఒక్క పరుగుకే పెవిలియన్ పంపాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ కూడా పెద్దగా రాణించలేకపోయాడు. 26 పరుగులకే ఔటయ్యాడు.
బెన్ స్టోక్స్, హారీ బ్రూక్, మోయిన్ ఆలీలు జాగ్రత్తగా ఆడారు. అసవసర తప్పిదాలకు పాల్పడకుండా పరుగులు సాధించారు. వికెట్లు కోల్పోకుండా జట్టు స్కోర్‌ను నెమ్మదిగా పెంచుతూ పోయారు. హ్యారీ బ్రూక్ 20 పరుగులు చేసి ఔటయ్యాడు.
బెన్ స్టోక్స్ చివరి వరకు నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.