మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఓ స్కూల్ గర్ల్ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యారు. నిన్ననే డబ్ల్యూపీఎల్ వేలం ముగిసింది... ఈ రోజు మ్యాచ్ ప్రారంభం అయింది... ఎంత విశేషం... నీ బ్యాటింగ్ చూసి చాలా ఎంజాయ్ చేశాను అంటూ లిటిల్ మాస్టర్ ఆమె బ్యాటింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఆమె సూర్యకుమార్ ఆట తీరును చూసి, అతనిలా లాంగ్ షాట్స్ కొట్టే మెళకువలు కూడా తెలుసుకోవాలని సూచించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ (Azharuddin)నేతృత్వం వహిస్తున్న కమిటీని రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుత కమిటీ స్థానంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు( Supreme Court) వెల్లడించింది.
ముఖేశ్ గౌడ్ స్మారక 'మల్లయుద్ధ' (Mallayud'dha)'రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలు ఘనంగా ముగిశాయి. ( LB Stadium)ఎల్బీ స్టేడియంలో నాలుగురోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగినయి.బాలకేసరి, పురుషుల, మహిళల విభాగాల్లో ఓవరాల్‌గా 17 కేటగిరీల పోటీలు నిర్వహించారు.
ఇండియన్ స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మళ్లీ పెళ్లి చేసుకోనున్నట్లు తెలిసింది. ఈ ఏడాది ప్రేమికుల రోజున తన భార్య నటాసా స్టాంకోవిక్ తో గ్రాండ్ గా వివాహం చేసుకోవాలని భావించినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నీటిలో చిరుత కన్నా వేగంగా పరుగెత్తగలడు.. చేపలు, తిమింగళాల కన్నా వేగంగా ఈదగల నైపుణ్యం అతడి సొంతం. పోటీలు ఎక్కడైనా అతి వేగంగా నీటిలో దూసుకెళ్లగలడు.. పతకాలు కొల్లగొట్టగలడు. తండ్రి అగ్ర నటుడైనా అతడి పలుకుబడిని ఏనాడు వాడుకోలేదు. కష్టపడ్డాడు.. ఎదిగాడు.. ఇప్పుడు సత్తా చాటుతున్నాడు.
హిమాలయాల (Himalayas) మంచు కొండల్లో కొలువైన అందమైన ప్రదేశం. ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా నిలిచే ప్రాంతం. అలాంటి ప్రాంతంలో గిన్నీస్ రికార్డు బదలయ్యేలా ఓ క్రీడా సంబురానికి వేదిక కానుంది. ప్రస్తుతం చలికాలంలో మంచుగడ్డగా మారిన సరస్సులో 75 మంది స్వదేశీ, విదేశీ అథ్లెట్లు (Athletes) దూసుకెళ్లనున్నారు.
దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న మహిళల టీ20(Womens T20) వరల్డ్ కప్ లో టీమిండియా, పాక్(IND vs PAK) తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్(Team India) ఘన విజయం సాధించింది.
మహిళల టీ20(Womens T20) వరల్డ్ కప్ మ్యాచ్ భాగంగా నేడు పాక్ తో టీమిండియా(IND vs PAK) తలపడుతోంది. మొదట బ్యాటింగ్ చేపట్టిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 149 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 150 పరుగుల లక్ష్యం ఉంది.
‘ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్-2023’(T20 world cup)లో భాగంగా ఆదివారం ఇండియా-పాకిస్తాన్(India vs Pakistan) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈ సిరీస్‌లో ఇండియా తన తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
టీ20 మహిళా వరల్డ్(T20 World Cup) కప్‌లో రేపు కీలక మ్యాచ్ జరగనుంది. ఆదివారం కీలక మ్యాచ్ జరగనుంది. టీమిండియా, పాకిస్థాన్ జట్లు రేపు తలపడనున్నాయి. రేపు సాయంత్రం 06.30 గంటలకు పాక్, ఇండియా మ్యాచ్ జరగనుంది.
Jadeja fined for ointment : టీమిండియా క్రికెటర్ జడేజా కి షాక్ తగిలింది. ఆయనకు జరిమానా విధించారు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణం చేత ఆయనకు ఈ జరిమానా విధించడం గమనార్హం.
గవాస్కర్ టోర్నమెంటులో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా(IND vs AUS) టెస్ట్ సిరీస్ ఆడుతోంది. తొలి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా(Team India) స్పిన్నర్ల ధాటికి ఆస్ట్రేలియా జట్టు తొలి టెస్టులోనే కుదేలైంది.
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh pant) తన హెల్త్‌పై మరో అప్‌డేట్ ఇచ్చాడు. కర్ర సాయంతో రిషబ్ పంత్ నడుస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. తాను కర్రల సాయంతో నడుస్తున్నానని, త్వరగానే కోలుకుంటున్నానని తెలిపాడు.
నాగ్ పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. మ్యాచ్‌లో రోహిత్ అద్భుతగా బ్యాటింగ్ చేశాడు. రోహిత్ శర్మ సెంచరీ చేయడంతో మూడు ఫార్మాట్లు అయిన వన్డే, టెస్ట్, టీ20లో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు.
దేశంలో తొలిసారిగా అంతార్జాతీయ ఫార్ములా ఈ రేస్ కు హైదరాబాద్ (Hyderabad) రెడి అయింది. నగరం నడి బొడ్డున ట్యాక్ బండ్ (Tank band) తీరంలో స్ట్రీట్ సర్యూట్ పేరుతో ఏర్పటు చేసిన ట్రాక్ పై రేసింగ్ కార్లు (Car) రయ్ రయ్మంటూ దూసుకుపోనున్నాయి.