భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 9వ తేది నుంచి టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ మొత్తం 4 మ్యాచ్‌లతో ముగియనుంది. సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. రెండో మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇక మూడో మ్యాచ్ ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఆ తర్వాత అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆఖరి టెస్ట్...
టీమిండియా క్రికెటర్ జోగిందర్ శర్మ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లతో పాటు దేశవాలీ క్రికెట్‌కు ఆయన గుడ్ బై చెప్పారు. శుక్రవారం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)కు జోగిందర్ శర్మ తన రిటైర్మెంట్ లేఖను పంపాడు. ఇన్నిరోజులూ తనకు సహకరించిన బీసీసీఐకి, హర్యానా క్రికెట్ అసోసియేషన్‌కు, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిప...
టీమిండియా మహిళా క్రికెటర్లు హీరో విశాల్ సినిమాలోని పాటకు అద్భుతమైన డ్యాన్స్ వేశారు. ‘ఎనిమి’ సినిమాలోని ‘టమ్ టమ్’ పాటకు డ్యాన్స్ వేసి అలరించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్లో టీమిండియా మహిళా క్రికెటర్లు ఉన్నారు. టీ20 వరల్డ్ కప్‌కు ముందుగా టీ20 ట్రై సిరీస్‌లో వారు ఆడనున్నారు. Hopping on the Tum Tum trend 🤣...
మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఈ నెల 10వ తేది నుంచి ప్రారంభం కానుంది. ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీని ఐసీసీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించనుంది. అలాగే ఇండియాలో కూడా ఈ నెల 12వ తేది నుంచి మ్యాచులు జరుగుతాయి. తొలి మ్యాచ్ పాకిస్థాన్ తో ఉంది. ఇండియా తన దాయాదీ దేశం పాక్ తో తలపడనుంది. ఇటీవల ఐసీసీ మొదటిసారి అండర్19 మహిళా టీ20 ప్రపంచ కప్ నిర్వహించింది. అందులో టీమిండియా వరల్డ్ […]
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు. వరల్డ్ బెస్ట్ టీ20 బ్యాటర్స్‌లో తన కెరీర్లోనే ఉత్తమ స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో 47 పరుగులు చేసి, 910 పాయింట్లు దక్కించుకున్నాడు. రెండో మ్యాచ్‌లో 26 నాటౌట్‌గా నిలిచి, 908 పాయింట్లు దక్కించుకున్నాడు. అహ్మదాబాద్‌లో ఈ రోజు మూడో టీ20 ఉంది. ఇక్కడ బ్యాట్‌ను ఝులిపిస్తే పాయింట్లు మెరుగు పడతా...
భారత్ – న్యూజిలాండ్ ల మధ్య టీ20 సిరీస్ లో భాగంగా నేడు ఆఖరి మూడో టీ20 మ్యాచ్ అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియం వేదికగా జరుగనుంది. తొలి మ్యాచ్ లో కివీస్, రెండో మ్యాచ్ లో భారత్ గెలవటంతో ఇది సిరీస్ డిసైడర్ గా మారింది. సిరిస్ ను నిర్ణయించే మ్యాచ్ కాబట్టి రసవత్తర పోరు ఖాయం. ఈ టీ20 సిరీస్ లో భారత టాపార్డర్ బ్యాటర్లు ఇప్పటివరుకు రాణించలేదు.. ఓపెనర్లు శుభ్ మన్ గిల్, […]
క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు ఆధ్యాత్మిక బ్రేక్ తీసుకున్నారు. రిషికేష్‌లో స్వామి దయానందగిరి ఆశ్రమంలో స్వామీజీని కలిశారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. వీరు ఈ ఆధ్యాత్మిక ట్రిప్‌కు తమ కూతురు వామికను కూడా వెంట బెట్టుకొని వెళ్తుంటారు. ఈసారి మాత్రం పాప కనిపించలేదు. మంగళవారం ఉదయం ఈ జంట ఆశ్రమంలో స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. స్వామి దయానందగిరి జీ మహారాజ్ ప్రధాని నరేంద్ర మ...
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరెన్ పొలార్డ్ చెలరేగిపోయాడు. కేవలం 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో రెండు సిక్స్ లు హైలెట్ గా నిలిచాయి. పొలార్డ్ బాదుడి ధాటికి బంతులు రెండుసార్లు గ్రౌండ్ బయట పడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇంటర్నేషనల్ లీగ్ టీ20 తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. తొలిసారి గ్రౌండ్ బయటికి సిక్స్ కొట్టినప్పుడు ఆ బంతిని గ్రౌండ్...
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రముఖ ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు. మోకాలి లిగమెంట్ కు రిషబ్ పంత్ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. ఈ వారంలోనే పంత్ ను డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. డిసెంబర్ 30వ తేదిన ఇండియన్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొంది. మొదట డెహ్రాడూన్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు ...
ఏపీ స్పోర్ట్స్ శాఖ మంత్రి రోజా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో సభ్యురాలిగా నియమితులైనట్లు వెల్లడించింది. ఆర్కే రోజాతో పాటుగా మరో నాలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడా శాఖ మంత్రులకు కూడా సాయ్ సభ్యులుగా అవకాశం దక్కింది. సాయ్ లో రోజా దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కార్యదర్శి జతిన్ నర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. సాయ్ అధ్యక్షుడిగా కేంద్ర క్రీడల శాఖ మంత్రి కొన...
అంతర్జాతీయ క్రికెట్ కు ఇండియన్ క్రికెటర్ మురళీ విజయ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తాను రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. క్రికెట్ కెరీర్ లో మురళీ విజయ్ మొత్తం 87 మ్యాచులు మాత్రమే ఆడాడు. అలాగే 4490 రన్స్ చేశాడు. అత్యధికంగా చూసుకుంటే టెస్టు మ్యాచుల్లో మురళీ విజయ్ 61 మ్యాచులు ఆడాడు. టెస్ట్ మ్యాచుల్లో మొత్తం 3982 రన్స్ చేశాడు. ప్రస్తుతం అతని సగటు 38.29గా ఉంది. తాను క్రికెట్ కు వీడ్...
తొలిసారి నిర్వహించిన అండర్-19 టీ20 ప్రపంచకప్ లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. ఇంగ్లండ్ ను చిత్తు చేసి తొలి ట్రోఫీని చేజిక్కించుకుని సత్తా చాటారు. అండర్-19లో తొలిసారిగా నిర్వహించిన పొట్టి ప్రపంచ కప్ లో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లిష్ అమ్మాయిలు 69 పరుగులు లక్ష్యం విధించగా భారత్ సునాయాసంగా లక్ష్యం సాధించి ప్రపంచకప్ ను ముద్దాడింది. తొలుత బ్యాటింగ్...
టెన్నిస్ ఆటలో రారాజుగా సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ నిలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ -2023 టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫైనల్లో ఆదివారం గ్రీకు దిగ్గజం సిట్సిపాస్ తో హోరాహోరీగా తలపడి ఆఖరికి టైటిల్ ను చేజిక్కించుకున్నాడు. గతేడాది కరోనా వ్యాక్సిన్ కారణంగా తీవ్ర విమర్శల పాలై ఆస్ట్రేలియన్ ఓపెన్ కు దూరమైన జకోవిచ్ ఈసారి కసితో ఆడి టైటిల్ ను ముద్దాడాడు. ఫైనల్ పోరు నువ్వానేనా అన్నట్టు సాగింద...
IND vs NZ : భారత్, న్యూజిలాండ్ మధ్య మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోయే రెండో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా ముందు బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లక్నోలో జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా నుంచి తుది జట్టులో చోటు దక్కించుకున్న వారిలో హార్థిక్ పాండ్యా(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్ మన్ గిల్, రాహుల్ త్రిపాఠీ, సూర్యకుమార్ యాదవ్(వైస్ కెప్టెన్), దీపక్ ...
ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. రాంచీలో జరిగిన తొలి టీ20లో టీమిండియా న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓటమిపాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో హార్థిక్ సేన ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మూడు మ్యాచ్‌లో సిరీస్‌ను గెలుచుకోవాలంటే నేడు జరిగే మ్యాచ్ లో హార్ధిక్ సేన తప్పనిసరిగా గెలవాల్సిన ఉంది. అయితే టీమిండియా...