డేటా వినియోగంలో జియో వినియోగదారులు రికార్డులు సృష్టించారు. వారు ఒక నెలలో 10 ఎక్సాబైట్లు లేదా 10 బిలియన్ GB డేటాను ఉపయోగించారు. డేటా వినియోగంలో ఇది పెద్ద జంప్ అని జియో కంపెనీ(Jio Company) పేర్కొంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2023లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి మెరిసింది.
టీమ్ మారినా, జెర్సీ మారినా, ఆటగాళ్లు మారినా సన్ రైజర్స్ ఫేట్ మాత్రం మారలేదనే చెప్పాలి. గత రెండేళ్లుగా సన్ రైజర్స్(SRH) సత్తా చాటలేకపోతోంది. ఈ సీజన్ లోనూ పేలవ ప్రదర్శనతో హైదరాబాద్ జట్టు వెనపడుతోంది. మధ్యలో ఓ రెండు మ్యాచ్ లు గెలిచి అభిమానుల్లో ఆశలు పెంచినా.. మళ్లీ శుక్రవారం జరిగిన మ్యాచ్ లో చెన్నై(CSK) చేతిలో చిత్తుగా ఓడిపోయింది.
తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu).. రాజకీయాల్లో తన మార్గాన్ని సుగమం చేసుకుంటున్నాడు. క్రికెట్ కి పూర్తిగా వీడ్కోలు పలికి... రాజకీయాల్లో స్థిరపడాలనే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
సినిమా ప్రమోషన్స్ లో కొత్త పంథాని పట్టాడు.. అక్కినేని హీరో నాగచైతన్య(naga chaitanya). ఆయన తన కొత్త సినిమా Custody Movie ప్రమోషన్స్ కోసం ఐపీఎల్(IPL)ని వాడటం విశేషం.
స్వల్ప స్కోర్ ను చేధించడానికి దిగిన ఢిల్లీ కూడా తడబడింది. స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించడానికి చివరి ఓవర్ వరకు పోరాడింది. 15 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి రన్ రేట్ (Run Rate) పెంచుకోవాల్సింది పోయి విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
పంజాబ్ కింగ్స్‌తో ఈరోజు(ఏప్రిల్ 20)న జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli) తిరిగి RCBకి కెప్టెన్సీగా బాధ్యతలు స్వీకరించాడు. అయితే డు ప్లెసిస్ గాయం కారణంగా విరాట్ బాధ్యతలు స్వీకరించారు.