ఐపీఎల్(IPL 2023)లో నేడు గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్లో భాగంగా మొదట టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాంటింగ్ ఎంచుకుంది. గుజరాత్ భారీ స్కోరు(Score) చేయలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది.
గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) 66 పరుగులు చేశాడు. 50 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో పాండ్యా ఆ మాత్రం స్కోరును చేయడంతో గుజరాత్ జట్టు 135 పరుగులు చేయగలిగింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 6 ఫోర్లతో 37 బంతుల్లో 47 రన్స్ చేశాడు. మరో ఓపెనర్ అయిన శుభ్ మన్ గిల్(Shubhman Gill) డకౌట్ అవ్వడం జట్టుకు మైనస్ అయ్యింది.
గుజరాత్(Gujarat Titans) ఆటగాళ్లు మనోహర్ 3, ఆల్ రౌండర్ అయిన విజయ్ శంకర్ 10, డేవిడ్ మిల్లర్ 6 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టు తక్కువ స్కోరుకే ఔట్ అయ్యింది. లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) బౌలర్లు విజృంభించడంతో గుజరాత్ ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ కు చేరారు. లక్నో జట్టు(Lucknow Super Giants) లో కృనాల్ పాండ్యా 2, మార్కస్ స్టొయినిస్ 2, నవీనుల్ హక్ 1, అమిత్ మిశ్రా 1 వికెట్ ను పడగొట్టారు.