IND vs NZ : భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పూర్తయింది. పరిమిత 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 176 పరుగులు చేసి భారత్ కు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో మిచెల్, కాన్వే రాణించారు. మిచెల్ నాట్ అవుట్ గా నిలిచి 30 బంతుల్లో 59 పరుగులు చేశాడు. కాన్వే 35 బంతుల్లో 52 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఫిన్ అలెన్ 23 బంతుల్లో 35 పరుగులు చేయగా, ఫిలిప్స్ 22 బంతుల్లో 17 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇక.. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లు వేసి 2 వికెట్లను తీయగా, అర్ష్ దీప్, కుల్ దీప్, శివమ్ మావి తలో వికెట్ తీశారు.