టీ20 వరల్డ్ కప్ కి ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. వెన్ను గాయంతో… టీ20 వరల్డ్ కప్ నుంచి బుమ్రా దూరమయ్యాడు. దాదాపు నెల రోజుల పాటు అయినా..బుమ్రా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ వరల్డ్ కప్ కి బుమ్రా దూరమవ్వడం… టీమిండియా కి పెద్ద నష్టమనే చెప్పాలి.
బుమ్రాకు సర్జరీ అవసరమా లేదా అన్నదానిపై నేషనల్ క్రికెట్ అకాడెమీ ఫిజియోలు ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఆసియాకప్‌కు కూడా గాయం కారణంగా దూరమైన బుమ్రా.. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు తిరిగొచ్చిన విషయం తెలిసిందే. ఆ టీమ్‌తో తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్న బుమ్రా.. తర్వాతి రెండు మ్యాచ్‌లు ఆడాడు.
సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ సమయానికి బుమ్రాకు మళ్లీ గాయమైందని బీసీసీఐ తెలిపింది వెన్ను నొప్పి కారణంగా ఈ మ్యాచ్ ఆడటం లేదని వెల్లడించింది. ఇప్పుడిక సౌతాఫ్రికా సిరీస్‌తోపాటు వరల్డ్‌కప్ కూడా ఆడలేకపోతున్నాడు. ఇది ఇండియన్ టీమ్‌కు నిజంగా పెద్ద దెబ్బే. ముఖ్యంగా పేస్‌బౌలర్లు డెత్ ఓవర్లలో ఇబ్బంది పడుతున్న సమయంలో బుమ్రా లేని లోటు ఇండియన్ టీమ్‌ను మరింత దెబ్బ తీసే ప్రమాదం ఉంది.