Jadeja fined for ointment : జడేజాకి జరిమానా…. ఎందుకంటే..?
Jadeja fined for ointment : టీమిండియా క్రికెటర్ జడేజా కి షాక్ తగిలింది. ఆయనకు జరిమానా విధించారు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణం చేత ఆయనకు ఈ జరిమానా విధించడం గమనార్హం.
టీమిండియా క్రికెటర్ జడేజా కి షాక్ తగిలింది. ఆయనకు జరిమానా విధించారు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణం చేత ఆయనకు ఈ జరిమానా విధించడం గమనార్హం.
అసలు మ్యాటరేంటంటే… నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్ ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీలో జరగనుంది. కాగా…జడేజా టెస్టు మ్యాచ్‌లో అంపైర్ అనుమతి లేకుండా తొలి రోజు తన స్పిన్నింగ్ వేలికి క్రీమ్ రాసుకున్నాడు. దీంతో… ఆయనకు జరిమానా విధించారు.
‘ఆట యొక్క స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తనను ప్రదర్శించడానికి సంబంధించిన ఆటగాళ్ళు , సహాయక సిబ్బంది కోసం ICC ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.20ని రవీంద్ర జడేజా ఉల్లంఘించారు.’ అని ఐసీసీ పేర్కొంది. కాగా.. జడేజా నేరాన్ని అంగీకరించాడని, అధికారిక విచారణ అవసరం లేదని ఐసీసీ పేర్కొంది.
మొత్తం మ్యాటర్ నాగ్‌పూర్ టెస్టు తొలి రోజు అంటే ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 46వ ఓవర్లో జరిగింది. ఆ సమయంలోని వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో, జడేజా సిరాజ్ అరచేతిలో నుంచి క్రీమ్ లాంటిదాన్ని తీసి అతని ఎడమ చేతి చూపుడు వేలుకు రాస్తున్నట్లు కనిపించింది. ఆన్ ఫీల్డ్ అంపైర్ల అనుమతి లేకుండా జడేజా ఇలా చేయడం వల్ల అతనికి శిక్ష పడింది.