IPL Playoff:ఐపీఎల్ (IPL) ప్లే ఆఫ్ బెర్త్ కోసం టీమ్స్ పోటీ పడుతున్నాయి. నిన్నటి మ్యాచ్‌లో ముంబై ఓడిపోవడంతో.. మిగతా జట్లపై కూడా ప్రభావం చూపింది. 18 పాయింట్లతో ప్లే ఆప్ చేరిన తొలి జట్టుగా గుజరాత్ నిలిచింది. మిగతా మూడు స్థానాల కోసం పోటీ ఉంది.
ముంబైపై (MI) లక్నో (LSG) గెలవడంతో ఎల్ఎస్జీకి ప్లే ఆప్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. చెన్నై టీమ్ 15 పాయింట్లతో ఉంది. లాస్ట్ మ్యాచ్ ఢిల్లీపై గెలిస్తే టాప్-2 పోజిషన్లో ఉంటుంది. చెన్నై ఓడి.. లాస్ట్ మ్యాచ్‌ల్లో లక్నో, ముంబై, బెంగళూర్ గెలిస్తే.. సీఎస్కే ప్లే ఆప్ చేరే అవకాశం తక్కువగా ఉంటుంది.
చివరి మ్యాచ్‌లో ముంబై తప్పక గెలవాల్సిన పరిస్థితి. అప్పుడు 16 పాయింట్లతో ప్లే ఆఫ్ చేరుకుంటుంది. బెంగళూర్, పంజాబ్ కూడా గెలిస్తే 16 పాయింట్లకు చేరతాయి. మూడు 16 పాయింట్ల ఉంటాయి. లాస్ట్ మ్యాచ్‌లో ముంబై ఓడితే.. ప్లే ఆఫ్ చేరడం కష్టమే అవుతుంది.
రాజస్థాన్ భారీ విజయంతో బెంగళూర్‌కు రన్ రేట్ ఎక్కువగా ఉంది. చివరి రెండు మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవాల్సిన అవసరం ఉంది. ఇక పంజాబ్ కూడా రెండు మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంటుంది. ఈ జట్టు మైనస్ నెట్ రన్ రేట్ ఇబ్బంది కలిగిస్తోంది. ఈ రోజు ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ ఓడితే.. ప్లే ఆప్స్ అవకాశం ఉండదు.
పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ తప్పక గెలవాల్సి ఉంటుంది. ముంబై, బెంగళూర్ ఓడిపోవాల్సి ఉంటుంది. కోల్ కత ప్లే ఆప్స్ చేరాలంటే అద్భుతాలు జరగాల్సి ఉంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ ప్లే ఆప్స్ రేసు నుంచి వైదొలిగాయి.