ఆసియాకప్ 2022 ముగిసింది. ఈ సిరీస్ లో ఇండియా సెమీ ఫైనల్స్ కి కూడా చేరుకుండానే ఇంటి ముఖం పట్టింది. ఈ సిరీస్ ని శ్రీలంక చేజిక్కించుకుంది. కాగా… ఇది ముగియగానే… టీ20 వరల్డ్ కప్ కి అన్ని దేశాలు సమాయత్తమౌతున్నాయి. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ లో ఆడబోయే టీమిండియాను తాజాగా ప్రకటించారు.
అక్టోబర్ 16 నుంచి ఈ వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. ఈ వరల్డ్‌కప్ టీమ్‌లోకి పేస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్‌లు తిరిగి రాగా.. సంజు శాంసన్‌కు నిరాశే ఎదురైంది. వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, దినేష్ కార్తీక్‌లను సెలక్టర్లు ఎంపిక చేశారు.
ఈ వారం చివర్లో వరల్డ్ కప్ టీమ్‌ను అనౌన్స్ చేస్తారని భావించినా.. సోమవారం సమావేశమైన సెలక్టర్లు టీమ్‌ను ప్రకటించడం విశేషం. 15 మంది సభ్యులతో కూడిన టీమ్ వరల్డ్‌కప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లనుంది. ఇక మహ్మద్ షమి, రవి బిష్ణోయ్, శ్రేయస్ అయ్యర్, దీపక్ చహర్‌లను స్టాండ్‌బై ప్లేయర్స్‌గా ఉంచారు. ఆసియా కప్‌కు గాయంతో దూరమైన బుమ్రా మళ్లీ టీమ్‌లోకి వచ్చాడు.
అయితే వికెట్ కీపర్లుగా పంత్, కార్తీక్‌లను ఎంపిక చేశారు. సంజు శాంసన్, ఇషాన్ కిషన్‌లకు నిరాశే ఎదురైంది. అటు ఆసియా కప్‌లో గాయంతో మధ్యలోనే వెళ్లిపోయిన రవీంద్ర జడేజా పేరును కూడా సెలక్టర్లు పరిశీలించలేదు. స్పిన్నర్లుగా సీనియర్ రవిచంద్రన్ అశ్విన్‌తోపాటు యుజువేంద్ర చహల్, అక్షర్ పటేల్ ఉన్నారు. ఇక పేస్ బౌలింగ్ కేటగిరీలో బుమ్రా, భువనేశ్వర్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంపిక చేశారు.
ఇక టాపార్డర్‌లో రోహిత్, రాహుల్, విరాట్ కోహ్లి ఉండగా.. తర్వాత సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యాలకు టీమ్‌లో చోటు దక్కింది. మహ్మద్ షమిని 15 మంది సభ్యుల టీమ్‌లోకి ఎంపిక చేయకపోయినా.. స్టాండ్‌బైగా ఉంచారు.