»Gujarat Won The Toss And Elected To Bat Against Kolkata
IPL 2023: కోల్‌కతాపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్
ఐపీఎల్(IPL) మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata night riders) తలపడనుండగా రెండో మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి.
ఐపీఎల్(IPL) మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata night riders) తలపడనుండగా రెండో మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ రోజు జరిగే మొదటి మ్యాచ్‌కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. మ్యాచ్ లో భాగంగా మొదట టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టింది.
కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata night riders) జట్టు బౌలింగ్ చేయనుంది. మ్యాచ్ ప్రారంభానికి కొంత టైం ముందే ఆ మ్యాచ్ కు హార్దిక్ పాండ్యా దూరం అయ్యాడు. హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)కు స్వల్ప అస్వస్థత చోటుచేసుకుంది. దీంతో అతని స్థానంలో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టుకు కెప్టెన్‌గా రషీద్ ఖాన్ వ్యవహరించనున్నట్లు ఆ జట్టు యాజమాన్యం వెల్లడించింది.
హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) స్థానంలో విజయ్ శంకర్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) తుది జట్టులోకి వచ్చాడు. ఇప్పటి వరకూ కూడా గుజరాత్ టైటాన్స్ జట్టు ఈ టోర్నీలో రెండు మ్యాచులు ఆడగా రెండింటిలోనూ విజయం సాధించింది. మంచి ఊపు మీద ఉన్న గుజరాత్ టైటాన్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata night riders)తో ఢీకొట్టబోతోంది.
కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata night riders) జట్టు కూడా ఇప్పటి వరకూ రెండు మ్యాచులు ఆడింది. అందులో ఒక మ్యాచ్‌లో విజయం సాధించగా మరోక మ్యాచ్‌లో విఫలం అయ్యింది. గత మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుపై 81 పరుగుల భారీ తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. రెండు జట్లలోనూ మంచి స్పిన్నర్లు ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.