Sania Mirza: సానియా మీర్జా డివోస్..పాక్ ఆటగాడికి గుడ్ బాయ్?
సానియా మీర్జా(Sania Mirza).. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయాబ్ మాలిక్(shoaib malik)తో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్(Instagram) పోస్ట్‌లో షోయాబ్ మాలిక్‌ను మళ్లీ అవమానించినట్లు అనిపిస్తోంది. ఆమె రంజాన్‌కు ముందు తన కుమారుడు ఇజాన్‌తో కలిసి ఇఫ్తార్ భోజనం కోసం కూర్చున్నట్లు ఉన్న ఓ వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో భర్త షోయాబ్ కనిపించకపోవడం సహా ఆమె తన కుమారుడితో ఉండటంతో ఈ జంట విడిపోయారని పుకార్లు ఇంకా వెల్లువెత్తుతున్నాయి.
దిగ్గజ భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా(Sania Mirza).. తన భర్త, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయాబ్ మాలిక్(shoaib malik) తో డివోస్ తీసుకున్నారా? అంటే కొన్ని సంఘటనలు చూస్తుంటే నెటిజన్లు మాత్రం అవుననే అంటున్నారు. అవి ఏంటో ఇప్పుడు చుద్దాం. గత జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్-డబుల్స్ లో సానియా రన్నరప్‌గా నిలిచిన తర్వాత.. ఈ ఏడాది ప్రారంభంలో ఆమె క్రీడల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి సానియా దుబాయ్‌లో ఒంటరిగా తన కుమారుడితో నివసిస్తున్నారు. వ్యక్తిగత, ఇతర పనుల కోసం మాత్రమే భారతదేశాన్ని సందర్శిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఆమె తన కుమారుడు ఇజాన్‌తో కలిసి రంజాన్ మాసం జరుపుకున్న చిత్రాలను తన ఇన్ స్టా గ్రామ్(instagram) ఖాతాలో పోస్ట్ చేసింది. టెన్నిస్ స్టార్ ఇజాన్ మాలిక్‌తో పాటు రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త వీడియోను పంచుకున్నారు. అంతేకాదు ఈ పోస్టుకు ఇఫ్తార్ విత్ మై లవ్ అంటూ టాగ్ లైన్ ఇచ్చింది. ఈ వీడియో చూసిన పలువురు తన భర్త లేకుండానే ఒంటరిగానే సానియా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు గత సంవత్సరం నుంచే సానియా.. షోయాబ్ మాలిక్ తో దూరంగా ఉంటుందనే ప్రచారానికి ఇది మరోసారి ఆజ్యం పోసింది.
మరోవైపు షోయబ్ కూడా దుబాయ్(dubai)లో ఉన్నాడని తెలుస్తోంది. కానీ పాక్ క్రికెటర్ సానియా(Sania)ను కలిసిన సందర్భాలు కనిపించడం లేదు. మరోవైపు టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సానియా.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. మీర్జా మాలిక్ షోలో విడాకుల పుకార్ల గురించి షోయబ్ ను అడుగగా తమని ఒంటరిగా వదిలేయమని మీడియాను కోరాడు. టెన్నిస్ స్టార్ ఈ విషయంపై ఇంకా మాట్లాడలేదు. విడాకుల చుట్టూ ఉన్న పుకార్లను మీర్జా ధృవీకరించలేదు లేదా ఖండించలేదు. ఈ నేపథ్యంలో ఈ జంట తమ ప్రత్యేక మార్గాల్లో వెళ్లడానికి ముందు కొన్ని చట్టపరమైన సమస్యలను పరిష్కరించుకుంటున్నట్లు తెలుస్తోంది.