టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మిడిల్ ఆర్డర్ అస్సలు కలిసిరావడం లేదు. AUSతో జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్ 6వ స్థానంలో బరిలోకి దిగాడు. రెగ్యూలర్‌గా ఓపెనింగ్ స్థానంలో వచ్చే హిట్‌మ్యాన్ ఈ మ్యాచ్‌లో మిడిలార్డర్లో వచ్చి కేవలం 3 పరుగులతోనే సరిపెట్టుకున్నాడు. కాగా, రోహిత్‌కు మిడిల్ ఆర్డర్లో గొప్ప రికార్డులేమి లేకపోగా.. ఓపెనర్‌గా మారాకే టెస్టుల్లో రాణిస్తున్నాడు.