ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళా జట్టు ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 100 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ కేవలం 16.2 ఓవర్లలోనే ఐదు వికెట్లను కోల్పోయి విజయం సాధించింది. భారత బౌలర్లలో రేణుకా ఠాకూర్ 3, ప్రియా మిశ్రా 2 వికెట్లు తీశారు.