పాకిస్థాన్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే సంచలన విజయం సాధించింది. మూడు టీ20ల సిరిస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన ZIM.. పాక్‌ను 2 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ కేవలం 132 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్య ఛేదనలో వరుసగా వికెట్లు కోల్పోయిన జింబాబ్వే.. ఎట్టకేలకు మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కాగా.. బ్రియాన్ బెన్నెట్ 43 పరుగులతో రాణించాడు.