రెండో టెస్టుకు ఆసీస్ జట్టు నుంచి పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌ను తప్పిస్తారని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలను ఆ జట్టు స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఖండించాడు. ‘సన్నీ వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలు చూసి ఆశ్చర్యపోయాను. ప్రస్తుతం అతను వినోద పరిశ్రమలో ఉన్నాడని కొన్ని జట్లు అంటున్నాయి. ఒకవేళ అలాంటి వ్యాఖ్యలు ఆయనకు ఆనందాన్ని ఇస్తే.. అదే కొనసాగించమనండి’ అని పేర్కొన్నాడు.