భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజూ దక్షిణాఫ్రికా ఆధిపత్యమే కొనసాగింది. తొలి ఇన్నింగ్స్లో 247/6తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆ జట్టు 489 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ 6 ఓవర్లు మాత్రమే ఆడింది. ఆట ముగిసే సమయానికి భారత్ 9/0 స్కోరుతో నిలిచింది. యశస్వి జైస్వాల్ (7*), కేఎల్ రాహుల్ (2*) క్రీజులో ఉన్నారు.