అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో నితీశ్ రెడ్డి(42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే, ఇదంతా తన తండ్రి చేసిన త్యాగం వల్లేనని నితీశ్ వెల్లడించాడు. ‘నాకోసం మా నాన్న ఉద్యోగాన్ని వదిలేశారు. నేను ఇప్పుడు క్రికెటర్‌గా మారేందుకు ఆయన త్యాగాలే కారణం. ఆర్థిక సమస్యల కారణంగా ఒకరోజు మా నాన్న ఏడవడం చూశా. మేం ఎదుర్కొన్న కష్టాలు, మా నాన్న త్యాగం ముందు నా శ్రమ తక్కువే’ అని చెప్పుకొచ్చాడు.