»Dont Get Mad If You See The Dedication Of Football Player Messis Bodyguard The Video Is Viral
Lionel Messi: ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీ బాడీగార్డ్ డెడికేషన్ చూస్తే మతిపోద్ది.. వీడియో వైరల్
చాలా మంది ధనవంతులు, మోరుమోసిన ప్రముఖులు, సెలబ్రెటీలు జనాల్లో కనిపించినప్పుడు చుట్టూ బాడీగార్డులు ఉంటారు. అది వారి రక్షణ కోసం అని తెలుసు. అలాంటి అంగరక్షకుడిగా ఉన్న మెస్సీ బాడీగార్డ్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అతని వృత్తి పట్ల ఉన్న నిబద్ధతతకు అందరూ అవాక్కు అవుతున్నారు.
Don't get mad if you see the dedication of football player Messi's bodyguard.. The video is viral
Lionel Messi: లియోనల్ మెస్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఈ ఫుట్ బాల్ ఆటగాడి బాడీగార్డ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ సెక్యూరిటీ గార్డ్ అలర్ట్‌నెస్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు. తన పనిపట్ల నిబద్దత చూసి ఆశ్చర్యపోతున్నారు. మెస్సీ సరైన అంగరక్షకుడిని ఎంచుకున్నారు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మెస్సీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడు. చీమ చిట్టుక్కుమన్నా అలెర్ట్ అవుతున్నాడు ఆ బాడీగార్డ్. వీడీయో చూస్తే.. మెస్సి కాచుకొని ఉన్న ఆ సెక్యూరిటీ తీరు కనిపిస్తుంది.
ఫుట్ బాల్ ఆటగాడు ఈ అర్జెంటీనా ప్లేయర్ లియోనల్ మెస్సీకి ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకనే చాలా మంది అభిమానులు ఆయన్ను ఒక్క సారి తాకాలని తహతహలాడుతారు. కనీసం ఆయన్ను దగ్గరి నుంచి చూడాలి అనుకునేవారు కోట్లలో ఉంటారు అంటే అతిశయం కాదు. అప్పుడప్పుడు మ్యాచ్ మధ్యలలో మైదానంలోకి దూసుకొస్తారు. కొన్ని సార్లు అభిమానంతో వచ్చినా ప్రమాదం జరుగుతుంది. అలాంటి సమయంలో బాడీగార్డ్ పనితనం అవసరం పడుతుంది. మెస్సీ విషయంలో వందశాతం ఆ పనిలో నిమగ్నమై ఉన్నాడు అతని పర్సనల్ బాడీగార్డ్. అతని పేరు యాసిన్ చ్యూకో నిరంతరం అప్రమత్తంగా, నమ్మకంగా ఉండే అంగరక్షకుడు.
ఆట కోసం మెస్సీ పరుగులు పెడుతుంటే అతన్ని కాయడానికి చ్యూకో పరుగెడుతుంటాడు. అతని ఒళ్లంత కళ్లేసుకొని గ్రౌండ్ అంతా పరీక్షించి చూస్తుంటాడు. అతని రక్షణ కవచాలు దాటీ ఈగ కూడా రాదు. ఇక అభిమానులను కూడా దరిచేరనియ్యడు. అయితే చాలా మంది ప్రేమతో వస్తారు. కానీ వారొచ్చే వేగానికి మెస్సీని పట్టుకొని కిందపడేసే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని ముందే పసిగట్టి ఎలాంటి ప్రమాదం జరగ్గకుండా అప్రమత్తపడుతారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇక యాసిన్ చ్యూకోకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఏకంగా 1.75 లక్షల మంది అతన్ని ఫాలో అవుతున్నారు. గతంలో ఈయన అమెరికా సైన్యంలో పనిచేశాడు. తరువాత మెస్సీ పర్సనల్ గార్డ్‌గా ఉన్నారు.