లా లిగా 2023 అంతర్జాతీయ ఫుట్ బాల్ మ్యాచులో సెల్టా విగో క్లబ్‌పై రియల్ మాడ్రిడ్(real madrid) క్లబ్ జట్టు గెలుపొందింది. 80 నిమిషాల పాటు జరిగిన ఉత్కంఠ పోరులో రియల్ మాడ్రిడ్ ఆటగాడు జూడ్ బెల్లింగ్‌హామ్ గోల్ చేసి జట్టును గెలిపించాడు.
శుక్రవారం రాత్రి జరిగిన అంతర్జాతీయ ఫుట్ బాల్ మ్యాచులో లా లిగాలో సెల్టా విగోను 0-1 తేడాతో రియల్ మాడ్రిడ్ జట్టు ఓడించింది. ఈ టీంలోని జూడ్ బెల్లింగ్‌హామ్ కీలక గోల్ చేయడంతో ఈ విజయం సాధించారు. అయితే జూడ్ బెల్లింగ్హమ్(Jude Bellingham) మొత్తం మూడు ఆటల్లో నాలుగు గోల్స్ చేసి రికార్డు సష్టించడం విశేషం. లా లిగా(2023/24 La Liga season) సీజన్‌ను ప్రారంభించిన మాడ్రిడ్(real madrid)కి ఇది మూడో విజయం కావడం గమనార్హం.
ఈ జట్టుతో తలపడిన సెల్టా విగో(celta vigo ) జట్టు 0-1తో ఓటమి పాలై లీగ్ నుంచి ఇంటికి వెళ్లింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్ 80వ నిమిషం వరకు చాలా ఉత్కంఠంగా కొనసాగింది. బెల్లింగ్హమ్ ఆట తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ లీగ్‌లో రియల్ మాడ్రిడ్ జట్టు ఆడింది మూడు ఆటలు కాగా అందులో నాలుగు గోల్స్ బెల్లింగ్‌హామ్ ఖాతాలోనే పడడం విశేషం. హోరాహోరిగా జరిగిన ఈ మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్ జట్టు విజయాన్ని ఆపడానికి సెల్టా విగో జట్టు ఆటగాడు వినిసియస్ చాలా శ్రమించాడు. గాయంతో పాటు పెనాల్టీ కూడా విధించుకున్నాడు. అయినా ప్రత్యర్థిజట్టును కట్టడి చేయలేకపోయాడు.