సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మరో రికార్డ్ నమోదైంది. సిక్కింతో మ్యాచ్‌లో బరోడా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీ20 చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. భాను పూనియా 51 బంతుల్లో 134 రన్స్‌తో ఊచకోత కోశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 15 సిక్సర్లు, 5 ఫోర్లున్నాయి. శివాలిక్ శర్మ 55, అభిమన్యు సింగ్ 53, సోలంకి 50 రన్స్‌తో రాణించారు.