ఆడిలైడ్ వేదికగా కాసేపట్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఈ వేదికలో టాస్ అత్యంత కీలకం కానుంది. ఇక్కడ ఇప్పటివరకు జరిగిన 82 టెస్టుల్లో టాస్ గెలిచిన జట్లు 72 సార్లు బ్యాటింగ్ ఎంచుకున్నాయి. అందులో 33 సార్లు గెలిచాయి. రెండు సార్లు మాత్రమే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జట్లు ఇక్కడ విజయం సాధించాయి. దీంతో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.