»Bowling Team India Won The Toss First Odi Against Aussies
First ODI : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా .. ఆసీస్ తో తొలి వన్డే
ముంబైలోని (Mumbai) వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా(Team India) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో (Border - in the Gavaskar Trophy) 2-1 విజయం సాధించిన తర్వాత వన్డే పోరు జరుగుతోంది. ఆస్ట్రేలియాతో (Australia) జరిగే 3-మ్యాచ్‌ల వన్డేసిరీస్లోనూ విజయం సాధించాలని కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Captain Hardik Pandya)సేన భావిస్తోంది. రోహిత్ శర్మ తొలి వన్డే నుంచి తప్పుకోవడంతో జట్టును నడిపించే బాధ్యతను హార్దిక్ పాండ్యాకు అప్పగించారు.
ముంబైలోని (Mumbai) వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా(Team India) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో (Border – in the Gavaskar Trophy) 2-1 విజయం సాధించిన తర్వాత వన్డే పోరు జరుగుతోంది. ఆస్ట్రేలియాతో (Australia) జరిగే 3-మ్యాచ్‌ల వన్డేసిరీస్లోనూ విజయం సాధించాలని కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Captain Hardik Pandya)సేన భావిస్తోంది. రోహిత్ శర్మ తొలి వన్డే నుంచి తప్పుకోవడంతో జట్టును నడిపించే బాధ్యతను హార్దిక్ పాండ్యాకు అప్పగించారు. రోహిత్‌తో పాటు, శ్రేయాస్ అయ్యర్ కూడా మ్యాచ్‌తో పాటు మొత్తం సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. తొలి వన్డేలో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో రంగంలోకి దిగింది.
మరోవైపు ఆసీస్ జట్టు స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (Steve Smith) సారథ్యం వహిస్తున్నాడు.కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకున్న ఆతిథ్య జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కూడా నిలబెట్టుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) రెండవ వన్డేకి తిరిగి వస్తాడని భావిస్తున్నారు. KL రాహుల్ టీమ్ ఇండియాకు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తాడు. ఇషాన్ కిషన్ (Ishan Kishan) రెగ్యులర్ కెప్టెన్ స్థానంలో ఓపెనింగ్ స్థానంలో శుభ్‌మాన్ గిల్(Shubman Gill) తో భాగస్వామిగా ఉంటాడు.