సూపర్ హాట్ ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండవ టెస్టులో అద్భుత సెంచరీతో చెలరేగాడు. మొదటి నుంచి వన్డే తరహా బ్యాటింగ్ చేస్తూ కేవలం 91 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించాడు. ఓ పక్క వికెట్లు కోల్పోతున్నా.. బ్రూక్ మాత్రం కివీస్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కాగా, బ్రూక్‌కు ఇది 8వ సెంచరీ.