ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ సిరీస్‌లు సాధిస్తామని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ధీమా వ్యక్తం చేశాడు. ‘మేం మంచి స్థితిలో ఉన్నాం. 3 మ్యాచ్‌ల తర్వాత 1-1తో సిరీస్ ఆసక్తికరంగా మారింది. రాబోయే రెండు మ్యాచుల్లో మేం ఒకటి గెలిచిన సిరీస్‌ను కాపాడుకుంటాం. ఎందుకంటే గత రెండుసార్లు ఇక్కడ మేం సిరీస్ గెలుచుకున్నాం’ అని పేర్కొన్నాడు. ఇప్పుడు తమ ఫోకస్ అంతా బాక్సింగ్‌డే టెస్టుపైనే ఉందన్నాడు.