ఆసియా కప్ లో టీమిండియా మహిళల జట్టు అదరగొట్టింది. ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకతో పోరాడిన టీమిండియా మహిళల జట్టు…8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి లంక జట్టును 65 పరుగులకే కట్టడి చేశారు. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన భారత్ సునాయాశంగా విజయం సాధించింది. 11.3 ఓవర్లలోనే టార్గెట్ రీచ్ అయింది. ఆసియా కప్ టోర్నీని కైవసం చేసుకుంది. భారత్‌కు ఇది 7వ ఆసియా కప్ విజయం. భారత బౌలర్లలో రేణుకా సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. పవర్ ప్లే ఓవర్లలో పరుగులు చేసే అవకాశం ఇవ్వకుండా లంక ప్లేయర్లను కట్టడి చేసింది.
తొలుత భారత బౌలర్లు లంకను 65 పరుగులకే పరిమితం చేయగా ఆ లక్ష్యాన్ని 8.3 ఓవర్లలో ఊదేశారు బ్యాటర్లు. దీంతో గత ఎడిషన్ ఫైనల్లో మిస్ అయిన ఆసియా కప్ టైటిల్ మళ్లీ భారత మహిళల ఖాతాలోనే చేరింది. 8 ఎడిషన్లలో ఏడు సార్లు భారత మహిళా జట్టే విజేతగా నిలవడం విశేషం..
66 పరుగుల లక్ష్యఛేదనలో షెఫాలీ వర్మ (5 పరుగులు), జెమీమా రోడ్రిగ్స్ 2 వికెట్లను త్వరగా కోల్పోయింది టీమిండియా. అయితే స్మృతి మంధాన 25 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసి అజేయంగా నిలిచి మ్యాచ్‌ని ముగించారు.