టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో టెస్టుల్లో అతడి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరు అనే విషయం ఆసక్తి రేపుతోంది. ఈ జాబితాలో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీళ్లు నిలకడగా ఆడకపోవడం మైనస్. ఒక సిరీస్ ఆడితే మరో సిరీస్లో విఫలమవుతున్నారు. దీంతో జట్టులోకి వచ్చి వెంటనే స్థానం కోల్పోతున్నారు.