విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. బీహార్ తరఫున బరిలోకి దిగిన వైభవ్ (190) తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కేవలం 54 బంతుల్లోనే 150 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే లిస్ట్-ఏ క్రికెట్లో సౌతాఫ్రికా దిగ్గజం డివిలియర్స్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. ABD 64 బంతుల్లో 150 పరుగులు చేశాడు.