అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జైస్వాల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ క్రీజులో కుదురుకున్నట్లు కనిపించినా.. 37 పరుగులతో నిరాశపర్చాడు. గత మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన కోహ్లీ (7), మరోవైపు గిల్ (31) పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ (1), పంత్ (4) ఉన్నారు. స్టార్క్ మూడు వికెట్లు తీసుకున్నాడు.