భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫార్మట్‌కు వీడ్కోలు పలికాడు. అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో తన విరమణపై పలు అనుమానాలు వ్యక్తం అవ్వడంతో తాజాగా స్పందించాడు. తనకు ఎవరిపై కోపం లేదని, తన రిటైర్మెంట్కు ఎవరూ బాధ్యులు కాదని స్పష్టం చేశాడు.