ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ నిరాశపరిచాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీంతో ఓ చెత్త రికార్డును జైశ్వాల్ తన పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై తొలి బంతికే ఔటైన నాలుగో ప్లేయర్‌గా జైశ్వాల్ నిలిచాడు. ఓవరాల్‌గా టెస్టు మ్యాచులో తొలి బంతికే ఔటైన ఏడో భారత బ్యాటర్‌గా నిలిచాడు.