ఆసీస్, భారత్ మధ్య బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్ట్ జరిగింది. మూడో రోజు ఆట ముగిసిన అనంతరం భారత పేసర్ బుమ్రా విలేకరులతో మాట్లాడాడు. గబ్బాలో బ్యాటింగ్ పరిస్థితుల గురించి బుమ్రాను రిపోర్టర్ అడుగుతూ.. దీనికి సమాధానం చెప్పే సరైన వ్యక్తి మీరు కాకపోయినా భారత్ ఎలా ఆడుతుందో చెప్పాలని అన్నారు. దీనికి ‘నా బ్యాటింగ్ రికార్డు గురించి గూగుల్‌లో వెతుకు’ అని రిపోర్టర్‌తో బుమ్రా సరదాగా అన్నాడు.