అండర్ 19 ఆసియా మహిళల టీ20 ఛాంపియన్గా భారత్ నిలిచింది. బంగ్లాదేశ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 41 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 117/7 పరుగులు చేసింది. అనంతరం 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. 76 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక భారత బౌలర్లలో ఆయుషి శుక్లా 3 వికెట్లు తీసుకుంది. సోనమ్ యాదవ్, పరుణిక సిసోడియా చెరో 2 వికెట్లు పడగొట్టారు.