అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ తగిన వీడ్కోలుకు అర్హుడని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పేర్కొన్నాడు. భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైన అశ్విన్ ఇలా ఆటను వదలడం షాక్‌కు గురిచేసిందని తెలిపాడు. అశ్విన్ ముఖంలో ఆవేదన కనిపించిందని.. అతను బాధతో ఉన్నాడని వ్యాఖ్యానించాడు. భారత క్రికెట్‌కు అతను చేసిన అపారమైన కృషికి ఇంకెవరూ సరిపోరని కొనియాడాడు. అశ్విన్‌కు BCCI ఘనమైన వీడ్కోలు పలకాలని తెలిపాడు.