టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన చిన్ననాటి స్నేహితురాలు వన్శికతో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ జంట సోషల్ మీడియాలో ఒక ఫొటో షేర్ చేసింది. ఇందులో కుల్దీప్ బ్లాక్ సూట్లో, వన్శిక వైట్ గౌన్లో ఎంతో అందంగా కనిపించారు. ఈ ఫొటో చూసి నెటిజన్లు వీరిద్దరి జోడి బాగుందని కామెంట్లు చేస్తున్నారు. ఈ జంట ఈ ఏడాది చివర్లో వివాహం చేసుకోనున్నట్లు సమాచారం.