పారిస్ ఒలింపిక్స్ 2024లో అల్జీరియా మహిళా బాక్సర్ ఇమానె ఖెలీఫ్ పురుషుడు అని తేలడం సంచలనంగా మారింది. ఒలింపిక్స్ సమయంలో ఆమె మహిళ కాదంటూ వచ్చిన ఫిర్యాదులను ఒలింపిక్స్ సంఘం పట్టించుకోకపోవడంతో ఆమె స్వర్ణం గెలిచింది. తాజాగా ఆమెకు సంబంధించి మెడికల్ రిపోర్ట్ లీకైంది. అందులో ఖెలిఫ్కు పురుషుల్లో ఉండే XY క్రోమోజోములు ఉన్నాయని, గర్భాశయం కూడా లేదని స్పష్టమైంది. ప్రస్తుతం ఈ రిపోర్టు క్రీడా వర్గాలను షాక్కు గురి చేస్తోంది.