SKLM: పొందూరు పోలీస్ స్టేషన్ని శ్రీకాకుళం SP కేవీ మహేశ్వర రెడ్డి మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించి దొంగతనాలు నిర్మూలనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ పరిశీలనలో DSP సిహెచ్ వివేకానంద, ఆమదాలవలస CI పి.సత్యన్నారాయణ పాల్గొన్నారు.