దేశంలో రిజర్వేషన్లపై 50 శాతం ఉన్న పరిమితిని తీసేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరిగే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కులగణనలో ఏ ప్రశ్నలు అడగాలనేది అధికారులు నిర్ణయించకూడదు.. సామాన్యులు నిర్ణయించాలని పేర్కొన్నారు. HYDలో జరిగిన కులగణన సదస్సులో రాహుల్ ప్రసంగించారు. మేధావులు, పౌరహక్కుల నేతలతో చర్చించి కులగణనపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.