ఈ ఏడాది నవంబర్‌లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై ప్రశంసలు కురిపించాడు. “మ్యాచును మలుపు తిప్పగల ఆటగాళ్లు ప్రతి జట్టులో ఒకరో ఇద్దరో ఉంటారు. మా జట్టులో ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ అలా దూకుడుగా ఆడి మ్యాచును లాగేసుకుంటారు. పంత్ కూడా అలాంటి ఆటగాడే. కానీ, అతని దూకుడుకు మేం కళ్లెం వేస్తాం” అని అన్నాడు.