Kerala Shop Vendor: కొందరికీ జీవితం చివరి దశలో లక్ కలిసి వస్తోంది. ఎలా అంటే రూ.కోట్లు వచ్చి పడతాయి. అప్పటివరకు చిన్న, చిన్నగా కష్ట పడిన వారికి.. ఆ అదృష్టం వరించడంతో వారి ఆనందానికి అడ్డు ఉండదు. మొహంలో చిరునవ్వులు చిందిస్తాయి. అచ్చం అలాగే కేరళకు చెందిన చిన్న షాప్ ఓనర్ని అదృష్టం వరించింది. గంగాధరన్.. కండక్టర్‌గా పనిచేశాడు. 30 ఏళ్లు పనిచేసి అలసిపోయాడు. ఆ రద్దీలో.. టికెట్లు ఇవ్వడం వద్దునుకొని ఓ చిన్న కొట్టు పెట్టుకున్నాడు. అందులో తిను బాండారాలు విక్రయించేవాడు. అప్పుడప్పుడు లాటరీ టికెట్లు కూడా అమ్మేవాడు. అలా.. ఓ రోజు అతనికి లక్ కలిసి వచ్చింది.
కొట్టు పెట్టుకుని
కండక్టర్ జాబ్‌పై విసుగు చెంది కొట్టు పెట్టుకున్నాడు గంగాధరన్. అందులో పిల్లలకు చాక్లెట్, బిస్కట్స్ అమ్మేవాడు. ఇంకొంచెం డబ్బు కోసం లాటరీ టికెట్లను సేల్ చేసేవాడు. ఓ రోజు 5 లాటరీ టికెట్లు మిగిలిపోయాయి. రాత్రి వరకు చూసి.. ఇంటికి వచ్చేశాడు. ఆ టికెట్ల ద్వారా రూ.200 లాస్ అని అనుకున్నాడు. సరే అని.. పడుకుని, తెల్లారి కొట్టు వద్దకు వచ్చాడు. అక్కడ పేపర్ తిరగేశాడు. తన వద్ద ఉన్న లాటరీ టికెట్లలో ఒకదానికి రూ.కోటి లాటరీ తగిలింది. దాంతో అతను సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. కళ్లను తుడుచుకుని.. మళ్లీ మళ్లీ చూశాడు.
లాటరీ గెలిచి
లాభం లేదనుకొని ఇంటికి వచ్చాడు. అక్కడ కూడా లాటరీ టికెట్‌ను తదేకంగా చూశాడు. ఇంకేముంది కోటి రూపాయల లాటరీ వరించింది. ఈ విషయం తన ఇంట్లో వారికి చెప్పి సంబర పడ్డాడు. కోటీశ్వరుడిని అయిపోయానని మనస్సులోనే ఎగిరి గంతేశాడు. ఆ లాటరీతో గంగాధరన్ కష్టాలు తీరాయి. ఉన్న కొన్ని అప్పులు కట్టుకొని.. మిగతా జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నాడు. అతనికి ఇప్పుడు ఆర్థిక పరంగా సమస్యలు లేవు. అందరూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. మలి వయస్సులో అదృష్ట దేవత గంగాధరన్ కుటుంబాన్ని వరించింది.
రాత్రే కోటీశ్వరుడు
గంగాధరన్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. అలా అయ్యేందుకు అతను లాటరీ టికెట్ కొనుగోలు చేయలేదు. తన వద్ద మిగిలిన ఓ టికెట్ ద్వారా అతని లైఫ్ మారిపోయింది. కొందరు లాటరీ కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అయినప్పటికీ వారికి లాటరీ రాదు. అదృష్టం ఉంటే.. ఏదైనా వస్తోంది. అంతే తప్ప.. లాటరీ కోసం డబ్బులు ఖర్చు పెట్టొద్దు. ఉన్న డబ్బులు దుబారా చేసి.. ఇబ్బందులు పడొద్దు.