»Easter Festival Special Story What Is Resurrection Day
Easter : ఈస్టర్ ఫెస్టివల్ స్పెషల్ స్టోరీ…పునరుత్థాన దినం అంటే ఏమిటి ?
ఈస్టర్ (Easter) క్రిష్టియన్లకు ముఖ్యమైన రోజుల్లో ఒకటి. శిలువ వెయ్యడం వల్ల మరణించిన ఏసు క్రీస్తు (Jesus Christ) మూడవ రోజున పునరుత్తానాన్ని ఈస్టర్ గా క్రిష్టియన్లు జరుపుకుంటారు. గుడ్ ఫ్త్రెడే (Good Friday) తర్వత మూడోవ రోజు ఈస్టర్ వస్తుంది మరణానంతరం మూడోరోజున ఏసుక్రీస్తు పునరుత్తానం అనేది మరణాన్ని జయించడానికి ప్రతీక మాత్రమే కాదు, పాపం నుంచి విముక్తిగా కూడా పరిగణిస్తారు.
ఈస్టర్ (Easter) క్రిష్టియన్లకు ముఖ్యమైన రోజుల్లో ఒకటి. శిలువ వెయ్యడం వల్ల మరణించిన ఏసు క్రీస్తు (Jesus Christ) మూడవ రోజున పునరుత్తానాన్ని ఈస్టర్ గా క్రిష్టియన్లు జరుపుకుంటారు. గుడ్ ఫ్త్రెడే (Good Friday) తర్వత మూడోవ రోజు ఈస్టర్ వస్తుంది మరణానంతరం మూడోరోజున ఏసుక్రీస్తు పునరుత్తానం అనేది మరణాన్ని జయించడానికి ప్రతీక మాత్రమే కాదు, పాపం నుంచి విముక్తిగా కూడా పరిగణిస్తారు. ఈస్టర్ తో క్రైస్తవులు (Christians) లెంట్ సీజన్ కు ఒక సంతోషకరమైన ముగింపును ఇస్తారు. ఈ సమయంలో ప్రార్థనలు, ఉపవాసం చెయ్యడం, పాపానికి పాశ్చాత్తాపం వంటి వాటికోసం కేటాయించిన సమయం.ఏసుక్రీస్తు పునరుత్తానం జ్ఞాపకార్థం జరుపుకునే క్రైస్తవ పండుగ ఈస్టర్. వసంతం మొదలైన తర్వాత మొదటి పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం నాడు ఈస్టర్ జరుపుకుంటారు.కొన్ని పాశ్చత్య చర్చిల్లో, గ్రగేరియన్ క్యాలెండర్ (Gregorian calendar)ను అనుసరించి, సంప్రదాయ చర్చిల్లో జూలియన్ క్యాలెండర్ ను అనుసరించి ఈరోజును లెక్కించి నిర్ణయిస్తారు.
ఈస్టర్ అనే పదం మూలం గురించి కూడా రకరకాల వాదనలు ఉన్నాయి. బైబిల్(Bible) నిఘంటువును అనుసరించి ఈస్టర్ అనే పదం ఈస్ట్రే అనే పదం నుంచి వచ్చింది. నిజానికి ఇది సక్సన్ పదం. సాక్సన్ దేవతను సూచించే పదం. ఈ దేవత ఆరాధన కోసం పూర్వకాలంలో బలులు ఇచ్చే సంప్రదాయం ఉండేదట. ఏసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి రావడమే ఈస్టర్. ఆయన పునరుత్తానం(resurrection) అంటే అతడి మీద విశ్వాసం ఉన్న వారందరికి కూడా చిరాయువు ప్రసాదించబడుతుందని నమ్మకం. తన మూడు సంవత్సరాల బోధనలన్నింటికి పూర్తి దృవీకరణ ఈస్టర్ ముఖ్య ఉద్దేశ్యం. ఆయన పునరుత్తనం చెంది ఉండకపోతే మరొక బోధకుడు లేదా ప్రవక్తగా మిగిలిపోయే వాడు. కానీ అతడి పునరుత్తానం అతడు దైవకుమారుడని, మరణానికి అతీతుడని తిరస్కరించలేని రుజువును చూపుతుందని క్రైస్తవుల నమ్మకం.ఏసు పునరుత్తానం నజరేతుకు చెందిన ఏసును ఇజ్రాయెల్ (Israel)లో ప్రవచించిన మెస్సియగా, జెరూసలేం (Jerusalem) కు కొత్త రాజు లేదా ప్రభువుగా దృవీకరించింది. ఇది కొత్త రాజ్యానికి కొత్త స్వర్గం గా బైబిల్ చెబుతోంది.
క్రీస్తు పునరుత్తానం ఒక్కటే కాదు ఈస్టర్ అంటే అందుకు భిన్నమైన ఉద్దేశాలు కూడా ఉన్నాయి. ఈస్టర్ విందు వసంతకాల ఆగమనానికి స్వాగతంగానూ సక్సన్ దేవత ఈస్ట్రేను ఆరాధించే రోజుగా కూడా చెబుతారు. ఈ రోజుల్లోనే క్రీస్తు పునరుత్తానం జరిగినట్టుగా చెబుతారు.యూదు సంప్రదాయం ప్రకారం ఈజిప్ట్ నుంచి యూదులు బానిసత్వం నుంచి లభించిన విముక్తికి గుర్తుగా యూదుల హాలీడేగా ఈస్టర్ విందులు జరుపుకుంటారు.ఏసు క్రీస్తు త్యాగానికి, స్వచ్ఛతకు గుర్తుగా ఈస్టర్ లిల్లిలతో చర్చిలు, ఇళ్లను అలంకరిస్తారు. ఈస్టర్ ఇంకా ఎన్నో వేడుకలకు ప్రారంభంగా ఉంటుంది. ఆష్ వెడ్నెస్ డే (ఫస్ట్ డే ఆప్ లెంట్) గా పిలిచే మొదటి బుధవారం అంటే క్రీస్తు ఎడారిలో చేసిన 40 రోజుల ఉపవాసదీక్షకు గుర్తుగా ఈ 40 రోజుల పాటు తమకు చాలా ఇష్టమైన ఒక పదార్థాన్ని విడిచి పెట్టడం సంప్రదాయంగా సాగుతోంది. పామ్ సండే (Palm Sunday) అంటే ఏసు జెరుసలేంలోకి ప్రయాణించిన మెస్సియగా మారిన రోజు. గుడ్ ఫ్రైడే అనేది ఏసు శిలువ వేయబడిన రోజు. ఇలా అనేక పండుగలు ఈస్టర్ (Easter) కు అనుంధానంగా జరుపుకుంటారు.