»Dont Join The That Type Of Call Centre Job Says Police
Cyber Cheaters: జాబ్ మేసెజ్‌ల విషయంలో జాగ్రత్త.. నిరుద్యోగులకు పోలీసుల వార్నింగ్
సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడ వేశారు. స్థానిక యువకులకు ఉద్యోగం కల్పించి, వారి చేత నిరుద్యోగులకు ఫోన్ చేయిస్తున్నారు. బ్యాంక్, ఈ-కామర్స్ సంస్థలలో జాబ్ అని చెప్పి మోసం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని, అందులో జాబ్ చేసే యువతకు పోలీసులు సూచిస్తున్నారు.
Don't Join The That Type Of Call Centre Job Says Police
Cyber Cheaters: నిరుద్యోగులను ఎరగా వాడుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు (Cyber Cheaters). వారికి జాబ్ ఇచ్చి.. మిగతా వారిని బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల వరసగా జరుగుతున్న కొన్ని ఘటనలను పరిశీలిస్తే అసలు విషయం తెలిసింది. ఈ విషయాన్ని ముందు పోలీసులు (police) పట్టించుకోలేదు. సీరియస్ నెస్ బట్టి విచారిస్తే అసలు విషయం తెలిసింది. కొందరికీ జాబ్ ఇచ్చి.. మంచి వేతనం ఆఫర్ చేస్తున్నారని గుర్తించారు. ఆ తర్వాత మిగతా వారిని ఉద్యోగం పేరుతో కాల్ చేసి.. మోసం చేస్తున్నారనే విషయం తెలుసుకున్నారు. మిగతావారికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఫేక్ కాల్ సెంటర్లలో చేరొద్దు.. జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు చెబుతున్నారు.
బ్యాంక్, ఈ-కామర్స్ సంస్థలలో జాబ్
సైబర్ నేరగాళ్లు (Cyber Cheaters) ఎంపిక చేసిన వారికి కొన్ని నంబర్లను ఇస్తారు. వారి చేత బ్యాంక్, ఈ-కామర్స్ సంస్థల నుంచి మాట్లాడినట్టు నమ్మిస్తారు. జాబ్ ఇస్తామని, మంచి వేతనం అని చెప్పి మోసం చేస్తున్నారు. ఇలాంటి చాలా కేసులు సైబర్ క్రైమ్ దృష్టికి వచ్చాయి. ఏం జరిగిందని విచారిస్తే.. సైబర్ కేటుగాళ్లు (Cyber Cheaters) వేసిన కొత్త ఎత్తుగడ బయటపడింది. నిరుద్యోగులను మోసం చేసేందుకు.. కొందరినీ నియమించుకుని.. వారి చేత మోసం చేస్తున్నారనే విషయం తెలిసింది. ఫేక్ కాల్ సెంటర్లో జాబ్ చేస్తోన్న కొందరికీ కొంత మొత్తం జీతం రూపంలో అందుతుంది. మిగతా అంతా సైబర్ కేటుగాళ్లు (Cyber Cheaters) క్యాష్ చేసుకుంటున్నారు. ఈజీ మనీ కోసం సైబర్ నేరగాళ్లు వేసిన నయా స్కెచ్‌ను సైబర్ పోలీసులు బయటపెట్టారు.
చదవండి:Film Chances: అమ్మాయిలకు మూవీ ఛాన్సులని గాలం..మోసపోతున్న బాధితులు మళ్లీ జాబ్ దొరకదు
నిరుద్యోగులకు జాబ్ ఆఫర్ చేసిన విషయం పోలీసులకు (police) ఇటీవల జరిగిన ఓ ఘటన ద్వారా తెలిసింది. కోట్లాది మంది డేటాను దోచుకుని డార్క్ వెబ్‌లో విక్రయించిన మోసగాడిని సైబర్ పోలీసులు (police) అరెస్ట్ చేశారు. ఆ సమాచారాన్ని కొనుగోలు చేసిన సైబర్ నేరగాళ్లు.. దాని ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఏకంగా కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అక్కడ పనిచేసేందుకు స్థానికులకు జాబ్ ఇస్తున్నారు. మంచి జీతం ఇవ్వడంతో.. వారు చేసేది తప్పు అయినా చేసేస్తున్నారు. ఇదివరకు ఇలాంటి కేసులలో నిర్వాహకులనే పోలీసులు (police) అరెస్ట్ చేసేవారు. ఇప్పుడు మాత్రం అలా చేయడం లేదు. ఎందుకంటే నిరుద్యోగులు తెలిసి మరీ తప్పు చేస్తున్నారు. అందుకే వారిని కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఉద్యోగం చేస్తూ.. ఒకసారి అరెస్ట్ చేస్తే.. జీవితంలో మరో చోట ఉద్యోగం దొరకడం కష్టం అవుతుంది. ఇదే విషయాన్ని నిరుద్యోగులకు పోలీసులు చెబుతున్నారు. సో.. జాబ్ చేసేప్పుడు అన్ని ఆలోచించి, మంచి వేదిక మీద ఉద్యోగం చేయాలని కోరుతున్నారు. లేదంటే భవిష్యత్‌లో జాబ్ దొరకడం కష్టంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
115 మంది అరెస్ట్
అమెరికాకు చెందిన వారిని మోసం చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు (police) గత శుక్రవారం అరెస్ట్ చేశారు. కాల్ సెంటర్ నిర్వాహకులతోపాటు అక్కడ పనిచేస్తున్న 115 మందిపై కేసులు నమోదు చేశారు. ఒకప్పటి లాగా కాకుండా.. కాల్ సెంటర్ ఉద్యోగం అనగానే.. అన్నీ ఆలోచించుకొని చేరాలని కోరుతున్నారు. లేదంటే మళ్లీ ఉద్యోగం దొరకడం కష్టం అవుతోందని చెబుతున్నారు. వారి ప్రొఫెషనల్ కెరీర్‌కు ఈ కాల్ సెంటర్ ఉద్యోగం అడ్డంకిగా మారుతోందని స్పష్టంచేశారు. సో.. నిరుద్యోగులు.. కాల్ సెంటర్ జాబ్ అనగానే ఎగిరి గంతేసి జాయిన్ కావొద్దని మరీ మరీ చెబుతున్నారు. ఆ సంస్థ గురించి, జాబ్ ప్రొఫెల్ గురించి అన్నీ సమగ్రంగా తెలుసుకోవాలని.. అన్నీ ఓకే అనుకుంటే ఉద్యోగంలో చేరాలని సజెస్ట్ చేస్తున్నారు.
బీ అలర్ట్..
మన వేలితో మన కంటిపై సైబర్ కేటుగాళ్లు (Cyber Cheaters) దాడి చేస్తున్నారని.. నిరుద్యోగ యువతి, యువకులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు (police) మరీ మరీ చెబుతున్నారు. లేదంటే వారి ఉచ్చులో పడి.. జీవితం నాశనం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కాల్ సెంటర్ జాబ్ అనగానే.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని.. తెలిసిన వారిని సంప్రదించి తెలుసుకొని జాయిన్ కావాలని సూచిస్తున్నారు.