Heart attack: హార్ట్ ఎటాక్‌ను ముందే గుర్తించండిలా..?
చిన్న పిల్లల నుంచి వయసు మళ్లిన వారి వరకు అందరు హార్ట్ ఎటాక్‌కు గురవుతున్నారు. ముందే గుర్తించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లక్షణాలు ఏంటో, స్ట్రోక్ వచ్చిప సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. పదండి.
Detect heart attack early.. These are the symptoms
Heart attack: హార్ట్ ఎటాక్(Heart attack) ఇటీవల పెరిగాయి. ఒకప్పుడు 50 ఆపై వయస్సు దాటిన వారిలో ఈ సమస్య తలెత్తేది. మారిన పరిస్థితుల నేపథ్యంలో పాఠాశాలలకు వెళ్లే విద్యార్థులలో కూడా గుండె సమస్యలు వస్తున్నాయి. వారానికి ఒక్కరన్న హార్ట్ ఎటాక్‌తో చనిపోయిన వార్తాలు చూస్తున్నాం. గణేష్ ఉత్సావాల్లో భాగంగా డ్యాన్స్ చేస్తూ యువకులు కుప్ప కూలిన సంఘటనలు విన్నాం. రెండు నెలల క్రితం సమస్య అధికం అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చొరువ తీసుకొని.. చాలా మందికి సీఆర్పీ ట్రైనింగ్ ఇచ్చింది.
కోవిడ్-19 సమయంలో వేసుకున్న వ్యాక్సిన్ల వల్ల స్ట్రోక్స్ అధికం అయిందనే పుకార్లు తెరమీదకు వచ్చాయి. అందుకు సరైన రుజువు లేదని వైద్యులే నిర్ధారించారు. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. వాటి లక్షణాలను పసిగట్టి ముందే వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. హార్ట్ ఎటాక్ అంటే ఏమిటి అనేది తెలుసుకుంటే.. మానవ గుండె నుంచి ప్రసరించే రక్తనాళాల్లో ధమనులు, సిరలు అనే రెండు ఉంటాయి. అందులో ధమనుల్లో కొవ్వు పేరుకుపోయినప్పుడు అది బ్లాక్ అవుతంది. దాని ద్వారా రక్త ప్రసారం జరగదు తద్వారా గుండె కొట్టుకోవడం మెల్లిగా తగ్గుతుంది. రక్త నాళాల గోడలపై పేరుకున్న కొవ్వు ఫలకాలు పగిలి విచ్ఛిన్నమైనప్పుడు రక్తం గడ్డకట్టి హార్ట్ ఎటాక్‌కు దారితీస్తుంది. దీంతో రక్తం, ఆక్సిజన్ గుండెకు చేరుకోలేవు. గుండె కండరాల పని తీరు దెబ్బతింటుంది. దీంతో ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్న వారికి ఈ రిస్క్ ఎక్కువ. అనారోగ్యకర జీవనశైలి, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారికి కూడా హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
హార్ట్ ఎటాక్ (Heart attack) లక్షణాలు తెలుసుకోవడం వల్ల ప్రాణాలు రక్షించే అవకాశం ఉంది. ఛాతీలో నొప్పి, ఛాతీలో బరువుగా ఉండి, ఛాతీ మధ్య భాగంలో పట్టేసినట్టు ఉండడం, అలసట, చెమటలు పట్టడం, గుండెలో మంటగా అనిపించడం, తల తిరగడం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం వంటి లక్షణాలు హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు. కొందరిలో ఛాతీ వెనుక భాగంలో నొప్పి, తిన్నది అరగకపోవడం, అలసట, దవడ నొప్పి కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలను ముందుగా గుర్తించి వైద్యులను సంప్రదిస్తే వారు తగు పరీక్షలు చేసి నిర్ధారణ చేస్తారు.
ఏ పరీక్షలు చేసుకోవాలి
ఆసుపత్రికి వెళ్లిన వెంటనే వైద్యులు ఈసీజీ (ECG) తీస్తారు. దీని ద్వారా హార్ట్ ఎటాక్ (Heart attack) రిస్క్‌ను చాలా వరకు గుర్తించవచ్చు. గుండెలో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ సక్రమంగా ఉన్నాయా.. లేక ఏదైనా తేడా ఉందా.. అనేది దీని ద్వారా తెలుస్తుంది. ఛాతీ ఎక్స్ రే ద్వారా కూడా గుర్తించొచ్చు. థ్రెడ్ మిల్ టెస్ట్ (Thread Mill Test) ద్వారా కూడా హార్ట్ ఎటాక్ రిస్క్‌ను గుర్తించవచ్చు. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు దెబ్బతిన్న గుండె కణజాలం నుంచి మజిల్ ప్రొటీన్లు విడుదల అవుతాయి. మయో గ్లోబిన్, ట్రోపోనిన్ ఐ, ట్రోపోనిన్ ఆర్ ప్రొటీన్లు విడుదలను రక్త పరీక్ష ద్వారా గుర్తించొచ్చు. మయోకార్డియల్ ఇన్ ఫార్షన్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు ట్రోపోనిన్ అస్సే టెస్ట్ చేయిస్తారు. హార్ట్ ఎటాక్ వచ్చిన 6-12 గంటల వరకు ఈ ప్రొటీన్లు సాధారణంగా రక్తంలో పెరుగుతాయి. 48 గంటల తర్వాత సాధారణ స్థితికి వస్తాయి. దీని సాయంతో హార్ట్ ఎటాక్ వచ్చిందీ? లేనిదీ గుర్తించి తదుపరి చికిత్సను నిర్ణయిస్తారు. ముఖ్యంగా టీఎంటీ టెస్ట్ ద్వారా మరుసటి ఏడాది వచ్చే హార్ట్ ఎటాక్ రిస్క్‌ను ముందుగా అంచనా వేయవచ్చు. 2డీ ఎకో పరీక్ష ద్వారా కూడా హార్ట్ ఎటాక్ రిస్క్‌ను గుర్తించవచ్చు.