విజయవాడలో బిల్డర్ అనిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, డ్రైవర్ వేధింపుల వాళ్లే సూసైడ్ చేసుకున్నానని లేఖలో రాశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
Builder Suicide: బిల్డర్‌కు టార్చర్ అంటే ఏంటో చూపించింది భార్య.. ఆమె వేధింపులు తాళలేక అతను సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన విజయవాడలో జరిగింది. తన చావుకు గల కారణం ఏంటో సూసైడ్ లెటర్లో ఇంచు పొల్లు పోకుండా రాశారు. ఇంతకీ అందులో ఏముంది అంటే..?
రాధాతో పెళ్లి
కృష్ణలంకలో దాసరి అనిల్ ఉంటున్నాడు. 30 ఏళ్ల క్రితం రాధా లక్ష్మీతో అతనికి పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. కూతురికి పెళ్లి చేశారు. బాధ్యత తీరిపోయింది. కుమారుడు అమెరికాలో చదువుకుంటూ.. పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. అనిల్ భార్య పేరు రాధా లక్ష్మీ.. కానీ పేరుకు తగినట్టు మాత్రం ఆమె లేదు. వయస్సు పెరిగే కొద్దీ బుద్ది మారింది. తన డ్రైవర్ గఫార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం అనిల్ గమనించలేదు. ఎప్పుడూ ఏదో పనిలో ఉండటం, సైట్ చూడటంలో బిజీగా ఉండేవాడు. దీనిని అలుసుగా తీసుకుని రాధా రాసలీలలను కొనసాగించింది.
ఆస్తి పేరున రాయించుకొని
మెల్లిగా ఆస్తిని అంత తన పేరున రాయించుకుంది రాధా.. ఆ సమయంలో కూడా అనిల్ అంత లెక్కచేయలేదు. ఆ తర్వాత వారి అక్రమ సంబంధం బయటపడింది. ఇదేంటని నిలదీసే పరిస్థితి లేదు. ఎందుకంటే అనిల్ వద్ద పనిచేసే గుమస్తా బోదగిరి రాము, అతని భార్య అరుణ కూడా అనిల్ వైపు లేరు. వారిద్దరూ కూడా రాధాకు మద్దతుగా నిలిచారు. దీంతో అతనికి అండగా ఒక్కరు కూడా లేరు. దీంతో మదన పడిపోయారు. ఇక్కడ లాభ లేదనుకొని కూతురు ఇంటికి వెళ్లాడు.. అక్కడే ఉంటున్నాడు.
కూతురు ఇంటికి వెళ్లినప్పటికీ..?
కూతురు ఇంటికి వెళ్లిన అనిల్‌కు మనశ్శాంతి కరవైంది. ఎప్పుడూ ఫోన్ చేసి.. ఏదో ఒకటి మాట్లాడేదట. తాను బతికి ఉంటే టార్చర్ తప్పదని భావించి ఉంటాడు. సమస్యను బిడ్డకు కూడా చెప్పలేదు. తన చావుకు గల కారణాన్ని పూసగుచ్చినట్టు లేఖలో పేర్కొన్నాడు. జీవితం ఇక చాలు అనుకొని.. ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడిని ఒంటరిని చేసి వెళ్లిపోయాడు.
తప్పని బలవన్మరణం
అనిల్ ఇంటి వద్ద ఉన్న సమయంలో వేధింపులు ఎక్కవ ఉండేవని లేఖలో వివరించాడు. తనను చంపేందుకు కూడా ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశాడు. కేసులు కూడా నమోదు చేశారని గుర్తుచేశాడు. భార్య గురించి తెలిసి బయటకు వెళ్లలేక, ఇంట్లో ఉండలేక మదనపడిపోయానని రాసుకొచ్చాడు. తన పరువు పోయిందని, మానసికంగా కుంగిపోయానని తెలిపాడు. ఈ విషయం పోలీసులకు చెబుదామని అనుకున్న న్యాయం జరగదని పేర్కొనడం గమనార్హం. ఎందుకంటే.. అతని ఇంట్లో కృష్ణ లంక ఎస్సై మనోహర్ ఉంటున్నాడు.. అతని వద్దకు వెళ్లిన తనకు న్యాయం జరగదని రాశాడు. అతను కూడా తన భార్యకు సపోర్ట్ అని అనిల్ లేఖతో తేటతెల్లం అయ్యింది.
తాళం పగలగొట్టి
బిల్డర్ అనిల్ చనిపోయిన తర్వాత ఇంటికి తాళం వేశారు. తర్వాత రాధా అండ్ కో ఇంటికి వచ్చారు. తాళం పగలగొడుతుండగా చుట్టపక్కల వారు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పారిపోయారు. దీంతో పోలీసులు అనిల్ ఆరోపణలు నిజం అని భావించారు. ఆ కోణంలో కేసు దర్యాప్తు చేపట్టారు. రాధా, గఫార్, రాము, అరుణపై కేసు నమోదు చేశారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.