ఈరోజు(జులై 8న) వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి. ఈ సందర్భంగా ఇప్పటికే వైఎస్ షర్మిల(ys sharmila) కడప చేరుకున్నారు. శనివారం ఉదయం తల్లి విజయమ్మ, కొడుకు, కూతురు, ఇతర కుటుంబీకులతో కలిసి ఆమె వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించనున్నారు. కానీ నిన్న తన పేరుతో ఉన్న భూమిపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రముఖ రాజకీయ సలహా సంస్థ ఐప్యాక్ సభ్యులు సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో వైసీపీ నేతల గురించి సీఎం జగన్ తో సుదీర్ఘంగా చర్చించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో భార్య గురించి అసభ్యకరంగా ట్వీట్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, క్షమాపణలు చెప్పకుంటే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని జనసేన పార్టీ హెచ్చరించింది. అసభ్య పోస్టులు పెట్టిన వారి వివరాలను తెలుపుతూ ట్వీట్ చేసింది.
తెలంగాణను అవమానించిన మోడీ ఏ మొహం పెట్టుకొని వస్తున్నారని రేపటి వరంగల్ పర్యటనను బీఆర్ఎస్ నాయకులంతా బహిష్కరిస్తున్నట్లు మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ తెలిపారు.
నారా లోకేష్ ఆరోపణలపై ప్రమాణం చేసిన అనిల్ కుమార్ వెంకటేశ్వరపురం తిరుమలేశుని ఆలయంలో ప్రమాణం చేసిన అనిల్ కుమార్ తనకు వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులున్నాని ఇటీవల లోకేష్ ఆరోపణ లోకేష్ ను ప్రమాణం చేయడానికి రమ్మన్నా కూడా రాలేదని చెప్పిన అనిల్ లేఅవుట్లలో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్న అనిల్ కుమార్ వారసత్వంగా వచ్చిన ఆస్తి కాకుండా తనకు రూ.10 కోట్ల మాత్రమే ఉందని వెల్లడి తాను చెప్పిన విధంగా ప్రమాణం చేశానని...
తెలుగు రాష్ట్రాలు ఎన్నికలకు ఇంకా 9 నెలల కంటే తక్కువ సమయం ఉన్నందున నెమ్మదిగా అన్ని పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన కొత్త పరిణామం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్‌ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti srinivas reddy) గురువారం సాయంత్రం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(AP CM Jagan mohan red...
బీజేపీ పార్టీమీద ఎన్ని విషప్రచారాలు చేసిన ప్రజల మద్దతు బీజేపీకే ఉంటుందన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. వరంగల్ కు ప్రధాని మోడీ వస్తున్న సందర్బంగా బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలుకాలని కోరారు.
వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. తమ దేశం అయిన కైలాస దేశ ప్రధానిగా నటి రంజితను నియమించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రకటన సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధి హామీలో కొత్తగా 23 పనులను చేర్చుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అలాగే త్వరలోనే బకాయిలు ఉన్న కూలీలకు వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
తెలంగాణకు మరో 8 మెడికల్ కళాశాలలు మంజూరయ్యాయి. దీంతో తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు కానుంది. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య కూడా మొత్తంగా 10 వేలకు చేరుకోనుంది.